Andhra PradeshHome Page Slider

“పిల్లలే మన రాష్ట్ర భవిష్యత్తు”:సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ ఇవాళ  అల్లూరి జిల్లా చింతపల్లిలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన చింతపల్లిలో ఏర్పాటు చేసిన సభలో పిల్లలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ..పిల్లలే మన రాష్ట్ర భవిష్యత్తు అన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలనే ఉద్దేశ్యంతోనే వారికి ట్యాబ్‌లు అందిస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.ఈ 55 నెలలు విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్నారు.రాష్ట్రంలో పిల్లలు,టీచర్లకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నామన్నారు.కాగా ట్యాబ్‌లతో పిల్లలకు చదువు సులభతరం అవుతుందని సీఎం తెలిపారు.ఈ ట్యాబ్‌లలో ఏ సమస్య వచ్చినా  వాటిని వెంటనే గ్రామ సచివాలయంలో ఇవ్వాలన్నారు. ఆ ట్యాబ్‌లను వారం రోజుల్లోనే రిపేర్ చేసి ఇస్తాం లేదంటే వాటి స్థానంలో కొత్త ట్యాబ్‌లు అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ట్యాబ్‌లలో సెక్యూర్డ్ మొబైల్ డివైజ్ మేనేజ్‌మెంట్  సాప్ట్‌వేర్ అందుబాటులో ఉంటుందన్నారు.ఈ ట్యాబ్‌లన్నీ పిల్లలకు చదువు విషయంలో మంచి చేసే గొప్ప ఇంధనం లాంటివి అని సీఎం పేర్కొన్నారు.కాగా ఈ ట్యాబ్‌లతో పిల్లలు తప్పుదోవ పడతారనే ఆందోళన తల్లిదండ్రులకు వద్దని సీఎం జగన్ సూచించారు. అయితే ఎంతో విలువైన కంటెంట్‌తో సహ ట్యాబ్‌లను పిల్లలకు అందిస్తున్నామన్నారు. ఏపీలో 6 నుంచి 12 వరకు ఉన్న అన్నీ తరగతులను డిజిటలైజేషన్ చేస్తున్నామన్నారు. ఈ మేరకు త్వరలోనే 10,038 స్మార్ట్ టీవీలను అన్ని ప్రభుత్వ స్కూల్స్‌లో ఏర్పాటు చేపిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.