crimeHome Page SliderTelangana

వీధికుక్క‌ల‌కు చిన్నారి విల‌విల‌

భాగ్య‌న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో వీధికుక్క‌ల బెడద పెరిగిపోయింది. జంతువుల క‌ళేబ‌రాలు,మాంసీకృ వ్య‌ర్ధాల‌ను తినడానికి అల‌వాటు ప‌డి చివ‌ర‌కు అవి దొర‌క్క‌పోతే మ‌తిస్థిమితం కోల్పోతున్నాయి.ఫ‌లితంగా చిన్నారులు క‌నిపిస్తు చాలు..క‌ళేబ‌రాలుగా భావించి వెంట‌ప‌డి ఈడ్చుకెళ్లి చంపేస్తున్నాయి.దీనికి సంబంధించిన ఓ ఘ‌ట‌న హైద్రాబాద్‌లోని రాజేంద్ర నగ‌ర్‌లో చోటు చేసుకుంది. గోల్డెన్ హైట్స్ కాల‌నీలో ఒంట‌రిగా రోడ్డుమీద ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని వీదికుక్క‌లు దాడి చేశాయి.ఒక కాలుని పీక్కుతిన్నాయి.మ‌రికొన్ని శ‌రీర భాగాల‌ను తీవ్రంగా గాయ‌ప‌రిచాయి.అటుగా వెళ్తున్న పాద‌చారులు వాటిని అద‌లించేలోపే జ‌ర‌గ‌రాని ఘోరం జ‌రిగిపోయింది.దీంతో చిన్నారి ప‌రిస్థితి విష‌మంగా మార‌డంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు.