Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

ఏసిబి వ‌ల‌లో చిల‌క‌లూరిపేట ఎంఈవో

ప‌ల్నాడు జిల్లా చిల‌క‌లూరిపేట మండ‌ల విద్యాశాఖ‌ధికారి ల‌క్ష్మీబాయి లంచం తీసుకుంటూ ఏసిబికి ప‌ట్టుబ‌డ్డారు.గ‌తంలో ఈమె అనేక వివాదాల్లో చిక్కుకున్నారు.దాదాపు 8 ఏళ్ల‌కు పైగా ఆమె ఈ ప‌ద‌విలో కొన‌సాగుతున్నారు.సోమ‌వారం ఓ విశ్రాంత ఉపాధ్యాయుడి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డారు.పి.ఎఫ్ డ‌బ్బులు ఇవ్వ‌డానికి సంత‌కం చేసేందుకు ఆమె ఈ లంచాన్ని డిమాండ్ చేసిన‌ట్లు బాధితుడు మీడియాకి తెలిపాడు.ఏసిబి అధికారులు వ‌ల‌ప‌న్ని ఆమెను అరెస్ట్ చేశారు.