Home Page SliderTelangana

తెలంగాణ విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష

హైదరాబాద్: విద్యుత్ రంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. సెక్రటేరియట్‌లో నిర్వహించిన ఈ సమీక్షలో మంత్రులు ఉతమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, విద్యుత్ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో పాటు ట్రాన్స్‌కో, జెన్‌కో అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్థల స్థితిగతులు, డిమాండ్, కొనుగోళ్లు, బకాయిలు తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చించారు. విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సదుపాయం, రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసే అంశాలపై అధికారులతో సమావేశం కానున్నారు.