స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి క్లారిటీ
టిజి: స్థానిక సంస్థల ఎన్నికలను రుణమాఫీ ప్రక్రియ పూర్తిచేసిన వెంటనే నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇంతకాలం తమ కోసం పనిచేసిన కార్యకర్తలను సర్పంచ్, కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా చేసే బాధ్యతను ఇప్పుడు తామంతా తీసుకుంటామని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు కట్టబెడతామని హామీ ఇచ్చారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ న్యాయం చేస్తామని వెల్లడించారు.