ఛీ దీనెమ్మ జీవితం…ఎన్ని పుష్పలు తీస్తే రూ.600కోట్లు రావాలి
తెలంగాణ సోషల్ మీడియాలో సస్పెన్షన్ ఇరిగేషన్ ఏఈఈపై సెటైర్లు టపాకాయల్లా కాదు…ఆటంబాంబుల్లా పేలుతున్నాయి. పుష్ప 2తో ఇండియా ట్రేడ్ మార్క్‌ని శాసించడానికి తెలుగోళ్లకి 50 ఏళ్ళు పట్టింది.కానీ మనోడు రూ.600కోట్లు అక్రమంగా సంపాదించడానికి 6ఏళ్లు కూడా పట్టలేదు.ఛీ దీనెమ్మ జీవితం…ఎన్ని పుష్పలు తీస్తే రూ.600కోట్లు రావాలి రా ? అంటూ నెట్టింట కామెంట్స్‌తో వైరల్ చేస్తున్నారు. అల్లుఅర్జున్ కంటే మనోడే తోపు మామా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ రూ.300కోట్లు తీసుకున్నాడని మీడియా కోడై కూస్తోంది.అది నిజమో కాదో తెలిదు గానీ … ఈడు మాత్రం రూ.600కోట్లు భలే నొక్కేశాడు మామా అంటూ జోకులు పేల్చుతున్నారు.


 
							 
							