లోన్ యాప్స్ అగడాలకు 1930తో చెక్
లోన్ యాప్స్ అగడాలపై కేంద్రం కీలక సూచనలు చేసింది. ఇకపై లోన్ యాప్స్ నుండి కాల్స్ వస్తే వెంటనే టోల్‌ఫ్రీ నెంబర్ 1930 ని సంప్రదించాలని ప్రజలకు వివరించింది. తక్కువ సమయంలో ఎక్కవ సంపాదన అని వచ్చే లింక్స్ అసలు ఓపెన్ చేయొద్దని తెలిపింది. బ్యాంక్ వివరాలు , పిన్ నెంబర్ , ఆధార్ , OTP ఫోటోలను ఇతరులుకు ఇవ్వొద్దు అని స్పష్టం చేసింది. అలాగే వాట్సాప్ , ఫేస్‌బుక్ , ఇన్‌స్టాలో వచ్చే లింకులను నమ్మి.. లోన్ యాప్స్‌లో కాంటాక్ట్స్ , అడ్రస్ , లొకేషన్ పర్మిషన్స్ ఇవ్వొద్దంది.