వృద్ధాప్యానికి చెక్ పెట్టండిలా..
దైవ స్మరణ కోసం చేసే ఉపవాసం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలకు కూడా ఉపవాసంతో చెక్ పెట్టొచ్చని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. తరచూ చేసే స్వల్పకాలిక ఉపవాసం.. ఊబకాయం బారిన పడకుండా.. స్థిరమైన, సమర్థవంతమైన బరువును మెయింటెయిన్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుందట. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ముఖ్యంగా దేహంలోని కణాలను రిపేర్ చేయడంలో.. కంటికి మెరుగైన నిద్ర అందించడంలో ఉపవాసం సహాయపడుతుంది. అన్నిటికన్నా ప్రధానంగా రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుందని పరిశోధనలో తేలిందట. మనలో వృద్ధాప్య ప్రక్రియ నెమ్మది కావాలంటే.. అతిగా తినకూడదని అంటున్నారు. రోజులో ఓ పూట కూడా భారీ స్థాయిలో తినకూడదని 20 శాతం కడుపు ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.