HealthHome Page SliderNational

మెటబాలిజం సమస్యలకు ఈ విటమిన్‌తో చెక్ పెట్టండి

వయస్సు పెరుగుతున్నకొద్దీ శరీర మెటబాలిజం నెమ్మదిస్తుంది. కండరాలు వదులయి, జీవక్రియల వేగం తగ్గుతుంది. అందుకే నడివయస్సు దాటినవారు శరీరపోషణ విషయంలో ప్రత్యేకశ్రద్ధ తీసుకోవాలి. కండరాలు, గుండె, హార్మోన్లు సక్రమంగా పనిచేయాలంటే విటమిన్ డి చాలా అవసరం. విటమిన్ డి సప్లిమెంట్ల వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది. ఎముకలు బలహీనంగా మారకుండా డి విటమిన్ ఉపయోగపడుతుంది. ఎండలో లభించే ఈ విటమిన్‌ను వయస్సు మళ్లినవాళ్లు అంత ఈజీగా పొందలేరు. వారు ఎండకు తిరగడం తక్కువ కాబట్టి దీనిని టాబ్లెట్ల రూపంలో తీసుకుంటే మంచిది. 70 ఏళ్ల వయస్సు ఉండే మగవారికి రోజుకు కనీసం 1000 నుండి 1200 ఐయూ కావలసి వస్తుంది. మహిళలకైతే 50 ఏళ్ల వయస్సు నుండే అధికమోతాదులో విటమిన్ డి తీసుకోవాలి.