Breaking NewscrimeHome Page SliderNational

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(AI) తో మోసాల‌కు చెక్‌

నేటి రోజుల్లో ఎంతో మంది వినియోగదారులు ఈ-కామర్స్ మోసాల బారీన ప‌డుతున్నారు. వాటి నుంచి రక్షించడానికి భారతదేశ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఏఐ టూల్స్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయనుంది.ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వినియోగదారుల రక్షణను బలోపేతం చేయడానికి అనేక రక్షణ చర్యలను తీసుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హెల్ప్‌లైన్, మోసపూరిత మార్కెటింగ్ పద్ధతులను గుర్తించే సాధనాలు అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ-కామర్స్ కంపెనీలు ఆన్‌లైన్ షాపింగ్ భద్రతను పెంచే విధంగా ఈ చర్యలు తీసుకున్నారు. ఏఐ ఎనేబుల్డ్ నేషనల్ కన్య్జూమర్ హెల్ప్‌లైన్, ఈ-మ్యాప్ పోర్టల్, జాగో గ్రాహక్ జాగో మొబైల్ అప్లికేషన్ వంటి నూతన వినియోగదారుల రక్షణ చర్యలను ప్రభుత్వం రూపొందించింది. దీంతో ప్రముఖ కంపెనీలైన రిలయన్స్ రిటైల్, టాటా సన్స్, జొమాటోతో సహా ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు ఈ భద్రతా చర్యలను తమ యాప్స్‌లో అందిస్తామని పేర్కొన్నారు. వినియోగదారుల వివాదాల పరిష్కారాన్ని వేగవంతం చేయడంలో గణనీయమైన పురోగతి సాధించామని జాతీయ వినియోగదారుల దినోత్సవ కార్యక్రమంలో మంత్రి జోషి అన్నారు.ఈ ఏడాది జనవరి నవంబర్ మధ్య జాతీయ కమిషన్‌లో దాఖలైన 3,628 కేసులలో 6,587 కేసులను దేశంలోని త్రీ-టైర్ వినియోగదారుల కోర్టు వ్యవస్థ ద్వారా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన ఈ-దాఖిల్ పోర్టల్ 2020లో ప్రారంభించారు. జూన్ 2023లో దేశవ్యాప్తంగా విస్తరించారు. కర్ణాటక, పంజాబ్ మరియు రాజస్థాన్ వంటి రాష్ట్రాలతో పాటు అనేక జిల్లాల్లో ఆన్‌లైన్ ఫిర్యాదుల కోసం 100 శాతం స్వీకరణను సాధించింది.