మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టండి..
మైగ్రేన్ తలనొప్పి బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. తలలో ఒకవైపు నొప్పి మొదలై తలంతా వ్యాపిస్తుంది. దీనినుండి తప్పించుకోవాలంటే ఒక్కటే మార్గం. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడమే. ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. తగినంత నీరు త్రాగాలి. ఎండలో ప్రయాణాలు మానుకోవాలి. దీనితో చాలావరకూ మైగ్రేన్ సమస్యను తప్పించుకోవచ్చు. అకస్మాత్తుగా మైగ్రేన్ వస్తే అల్లం, మిరియాలు, నిమ్మకాయలతో చేసిన టీ మంచి ఉపశమనంగా అనిపిస్తుంది. ఈ తలనొప్పి ప్రారంభమైనప్పుడు మొబైల్, కంప్యూటర్, స్క్రీన్స్ చూడకూడదు. చల్లటి కంప్రెస్ ఇవ్వాలి. మెడ, తలపై ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. లావెండర్ ఆయిల్ మసాజ్ కూడా ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మంచి నిద్రకు ప్రయత్నిస్తే తొందరగా మైగ్రేన్ నుండి ఉపశమనం కలుగుతుంది. శరీరంలోని సెరోటోనిన్ అనే రసాయనం సమతుల్యత కోల్పోయినప్పుడు మైగ్రేన్ సమస్య వస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కొక్కసారి జన్యుపరమైన కారకాక వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది.

