crimeHome Page SliderNational

బాలీవుడ్ నటుడిపై ఛీటింగ్ కేసు

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్రపై ఛీటింగ్ కేసు నమోదయ్యింది. ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ అనే వ్యాపారవేత్త గరం ధరం దాబా ఫ్రాంచైజీ డీల్‌లో ధర్మేంద్ర వల్ల మోసపోయినట్లు ఆయన ఫిర్యాదు చేశారు. నెలకు రూ.70 లక్షల టర్నోవర్ వస్తుందని ధర్మేంద్ర చెప్పడంతోనే తాను  రూ.63 లక్షల వరకూ పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. 2018లోనే ఒప్పందంపై సంతకం చేశానని పేర్కొన్నారు. ఈ డీల్‌పై అప్పటి నుండి ఎలాంటి పురోగతి లేదని, ధర్మేంద్ర నుండి స్పందన లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈ కేసులో ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ధర్మేంద్రతో పాటు మరో ఇద్దరికి సమన్లు జారీ చేసింది.