అమెరికా అధ్యక్ష ఎన్నికలపై చాట్‌జీపీటీ జోస్యం
నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికలలో చివరి ఎన్నిక జరగబోతోంది. దీనితో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్, హారిస్‌లలో ఎవరు గెలుస్తారన్న కుతూహలం నెలకొంది. ఈ విషయంలో చాట్‌జీపీటీ జోస్యం చెప్పింది. వీరిద్దరిలో ఎవరు గెలుస్తారన్న ప్రశ్నకు జవాబుగా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది. వీరిద్దరూ విజయం సాధించలేరని చాట్‌జీపీటీ తెలిపింది. ఎవ్వరూ ఊహించని విధంగా మూడోవ్యక్తి గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. అంచనాలు లేని అభ్యర్థులు గెలుస్తారని, ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వ్యక్తులు విజయం సాధిస్తారని తెలిపింది. మరికొద్ది గంటలలో అమెరికా భవితవ్యం తేలబోతోంది.

