ఛాట్ జీపీటీ bad gate way..
ఓపెన్ ఏఐకి సంబంధించిన ఛాట్ జీపీటీని ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుకుంటున్నారు. అయితే దీనిలో కొన్ని గంటల పాటు టెక్నికల్ సమస్య తలెత్తడంతో కోట్ల మంది యూజర్లు ఇబ్బంది పడ్డారు. దీనిని పరిశీలించిన ఏఐ వెబ్‌సైట్లోనే బాడ్ గేట్ వే (bad gate way) డౌన్ డిటెక్టర్‌లో ఎర్రర్ వచ్చినట్లు తెలిపింది. వీటిని ట్రాక్ చేసిన ఓపెన్ ఏఐ దానిని పరిష్కరించింది. ప్రస్తుతం ఛాట్ జీపీటీ మొబైల్ యాప్ బాగానే ఉందని, వెబ్‌సైట్‌లోనే bad gate way సమస్య తలెత్తిందని పేర్కొంది.

