Home Page SliderNational

చంద్రయాన్-3 దేశానికే గర్వకారణం..కానీ సిబ్బందికి జీతాలే ఇవ్వని వైనం

చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో యావత్తు భారతదేశం గర్వం పడుతోంది. అయితే ఇందులో భాగస్వాములై లాంచ్ ప్యాడ్‌ను నిర్మించిన రాంచీలోని HEC ఇంజనీర్లకు గత 14 నెలలుగా జీతాలు చెల్లించలేదని జాతీయ మీడియా వెల్లడించింది. కాగా ఈ ప్యాడ్‌ను నిర్మించిన దాదాపు 2,700 మంది కార్మికులు,450 మంది ఎగ్జిక్యూటివ్‌లకు జీతాలు ఇప్పటివరకు అందలేదని పేర్కొంది. వీరికి జీతాలు చెల్లించేందుకు రూ.1000 కోట్లు అందించాలని HEC కంపెనీ పలుమార్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖను కోరినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని HEC కంపెనీ తెలిపినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.