చంద్రుడివైపు దూసుకెళ్తున్న చంద్రయాన్-3
ఇస్రో ఇటీవల ప్రయోగించిన చంద్రయాన్-3 రాకెట్ విజయవంతమైన విషయం తెలిసిందే. అయితే ఈ చంద్రయాన్ సక్సెస్‌ఫుల్‌గా ఆకాశంలోకి దూసుకెళ్లడమే కాకుండా కక్ష్యల్లోకి కూడా విజయవంతంగా చేరుకుంటోంది. ఈ మేరకు చంద్రయాన్-3 తాజాగా ఐదో కక్ష్య పెంపులోకి చేరినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో చంద్రుడి కక్ష్యకు మరింత చేరువైనట్లు ఇస్రో పేర్కొంది. కాగా బెంగుళూరులోని ఇస్ట్రాక్ కేంద్రం నుంచి ఈ ప్రక్రియ చేపట్టినట్లు ఇస్రో తెలిపింది. అయితే తదుపరి కక్ష్యపెంపు ప్రక్రియ ఆగస్టు 1న అర్థరాత్రి 12 గంటల నుంచి ఒంటిగంట మధ్య చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. కాగా చంద్రయాన్-3 ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండ్ కానుంది.