Home Page SliderNews AlertTelangana

బీజేపీ పొత్తు కోసమే చంద్రబాబు డ్రామాలు..

ఖమ్మంలో నిర్వహించిన టీడీపీ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ పొత్తు కోసమే చంద్రబాబు డ్రామా చేస్తున్నారని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. తెలంగాణ భవన్‌ మీడియా సమావేశంలో మంత్రులు పువ్వాడ అజయ్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. చంద్రబాబు పాలనలోనే రైతు ఆత్మహత్యలు ఎక్కువ జరిగాయని హరీష్ రావు ఆరోపించారు. రైతులు గురించి మాట్లాడే అర్హత బాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఫ్లోరోసిస్‌ లేకుండా చేశానని చంద్రబాబు చెప్పడం పెద్ద జోక్‌ అని వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా తెలంగాణ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తోందన్నారు మంత్రి. ఇతర రాష్ట్రాలు తమ పథకాలను కాపీ కొడుతుందన్నారు. తెలంగాణ రైతాంగానికి, రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం నష్టం కలిగిస్తోందని విమర్శించారు. రైతుల కోసం కొత్త చట్టాలు తెచ్చి 750 మందిని పొట్టపెట్టుకున్న చరిత మీది అని ఆరోపించారు. రేపు అన్ని జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్ణయించాలని మంత్రి హరీష్‌ రావు పిలుపునిచ్చారు.