ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతల స్వీకరణ
ఏపీ సీఎం చంద్రబాబు సచివాలయానికి చేరుకున్నారు. ఏపీ సీఎంగా చంద్రబాబు నిన్న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు ఇవాళ ఏపీ సచివాలయానికి చేరుకున్నారు. అమరావతి రైతులు దారిపొడుగునా పూలతో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆయన సచివాలయానికి చేరుకున్నాక రాజధాని రైతలతోపాటు సచివాలయ ఉద్యోగులు ఆయనకు పూలతో స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు తన సచివాలయంలోని తన ఛాంబర్‌లోకి చేరుకున్నారు. కాగా అక్కడ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీ సీఎంగా చంద్రబాబు తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపైనే చేశారు. ఆయన తన రెండవ సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేశారు. ఏపీలో పెన్షన్ల పెంపుపై తన మూడవ సంతకాన్ని చేశారు. రాష్ట్రంలో అన్నక్యాంటీన్ల పునరుద్దరణపై తమ నాల్గవ సంతకాన్ని చేశారు. అనంతరం స్కిల్ సెన్సస్‌పై తన ఐదవ సంతకాన్ని సీఎం చంద్రబాబు చేశారు.ఈ విధంగా చంద్రబాబు ఎన్నికల హమీలను నెరవేర్చారు.దీని పట్ల ఏపీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

