Home Page SliderNational

చంద్రబాబు అరెస్ట్ బాధ కలిగించిందన్న తెలంగాణా మంత్రి

ఏపీలో చంద్రబాబు అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాలు భగ్గుమన్నాయి. కాగా చంద్రబాబును అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తూ ఏపీ,తెలంగాణా రాష్ట్రాల్లో టీడీపీ నాయకులు,నేతలు,కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అయితే చంద్రబాబును అరెస్ట్ చేసి నేటికి 26 రోజులు గడుస్తున్నాయి. దీంతో పలువురు ఏపీ ప్రభుత్వంపై మండి పడుతున్నారు. అసలు నేరం రుజువు కాకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని పలువురు ముఖ్యనేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే తాజాగా తెలంగాణా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కూడా చంద్రబాబును అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాగా ఏపీలో చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ఉమ్మడి ఏపీలో ఆయన నాయకత్వంలో మంత్రిగా పనిచేశాను. చంద్రబాబు అరెస్ట్ వ్యక్తిగతంగా నన్నెంతో బాధించింది. అధికారం శాశ్వతం కాదు. ఆయన పట్ల ప్రభుత్వ తీరు విచారకరం.ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.