వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని చంద్రబాబు ఇరికించేశాడు
మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదన్నారు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. టీడీపీ అధినేత చంద్రబాబు అవినాష్ రెడ్డిని కుట్రతో ఇరికించారన్నారు. కడప జిల్లా ముఖ్యనేతలతో అవినాష్ రెడ్డి భేటీ పూర్తయ్యాక రాచమల్లు ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సీబీఐ అరెస్టు చేస్తే అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు కాక తప్పదన్న ఎమ్మెల్యే, అరెస్టయినా బెయిల్‌పై బయటకు వస్తారన్నారు. అవినాష్ గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తిగా, ఆయన హింసను ప్రేరేపించరని స్పష్టం చేశారు. ఎంపీని నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్టు కాదన్నారు. న్యాయస్థానంలో కేసు రుజువైతే తాను రాజకీయాల్లో ఉండనని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు ఎమ్మెల్యే రాచమల్లు.


