చంద్రబాబుకు బుద్ధిరాదు..కొడాలి నాని
చంద్రబాబు పై కొడాలి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మహానగరాలతో పోల్చి ప్రజలలో ఆశలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. 29 నియోజకవర్గాలున్న నగరాలెక్కడా 29 గ్రామాలున్న అవరావతి ఎక్కడ అని ప్రశ్నించారు. వైజాగ్ సిటీలో 7 అసెంబ్లీ స్థానాలున్నయని గుర్తుచేసిన నాని.. 23 సీట్లకే టీడీపీని పరిమితం చేసినా చంద్రబాబుకు బుద్ధిరాలేదని దుయ్యబట్టారు. వైజాగ్‌లో పదివేల కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి సంపద సృష్టిస్తుందని పేర్కొన్నారు. ఆ ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వైసీపీకి అవరావతి ఎంతో విశాఖ , కర్నూలు కూడా అంతే అని , పరిపాలన రాజధానిగా వైజాగ్‌కు తీసుకెళ్లడం తథ్యం స్పష్టం చేశారు. న్యాయ రాజధానిగా కర్నూలు, పరిపాలన రాజధానిగా వైజాగ్ , శాసన రాజధానిగా అమరావతి జరిగి తీరుతాయని తెలిపారు.