Andhra PradeshHome Page Slider

కొత్త మేనిఫెస్టోతో చంద్రబాబు మోసం- జగన్

కొత్త మేనిఫెస్టోల పేరుతో చంద్రబాబు ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ సీఎం జగన్. పల్నాడు జిల్లాలో బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు జగన్.పక్క రాష్ట్రాల మేనిఫెస్టోతో కిచిడీ వండి పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు బతుకంతా మోసం, దగా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కొత్తగా బీసీ, మైనార్టీ డిక్లరేషన్లు అంటున్నారు.మహిళలు, బీసీల పేరుతో ఇప్పుడా డిక్లరేషన్లు అన్నారు. 14 సంవత్సరాల పాలనలో గాడిదలు కాశారా అంటూ మండిపడ్డారు. ఇన్నేళ్ల గుర్తుకు రాలేదా అన్నారు. ఇంటికో బెంజ్ కారు కొనిస్తామన్న మాటలు నమ్మవచ్చా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ‘దోచుకో, పంచుకో,తినుకో’ అనే ఫార్ములా పాటించారు . అది రిపీట్ కావాలని కోరుకుంటున్నారా? అంటూ ప్రశ్నించారు. మన పేద జగనన్న ప్రభుత్వం మాదిరి నేరుగా బటన్ నొక్కగానే డబ్బులు ఎకౌంట్‌లో పడే ప్రభుత్వం కావాలా తేల్చుకోమన్నారు. కురుక్షేత్రం వంటి ఈ ఎన్నికలలో జగన్‌తో కాదు పేదలతో యుద్ధం చేస్తున్నారు చంద్రబాబు . మీ జగనన్నకు ప్రజలే బలం అని, దేవుని దయ ఉంటే చాలన్నారు. బీజేపీ అండ తనకక్కర్లేదన్నారు. తమ ప్రభుత్వం ఇంటిటికీ మంచి చేసిందన్నారు. ఓటు ఎవరికి వెయ్యాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.