గేమ్ ఛేంజర్ జపం చేస్తున్న చంద్రబాబు
గేమ్ ఛేంజర్ హిట్టవుతుందో లేదో గానీ…అందులో తన ప్రభుత్వానికో ,తనకో గట్టి షేర్లున్నట్లుగా ఏపి సీఎం చంద్రబాబు పదే పదే గేమ్ ఛేంజర్ అనే పదాన్ని వాడుతున్నాడు.అసలే అల్లు అర్జున్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని చేసుకుని వైసీపి ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవి లాంటి వాళ్ల గెలుపు కోసం మౌనంగా ప్రచారం చేయడం, ఇటు చూస్తే జూ.ఎన్టీఆర్ కూడా తనను నిత్యం తూర్పార బట్టే వైసీపి మాజీ మంత్రులు కొడాలి,వల్లభనేని వాళ్లతో అంటకాగడం,మరో వైపు మెగా ఫ్యామిలీ (అల్లు ఫ్యామిలీ మినహా) వాళ్లు తప్ప పొలిటికల్‌గా తనకు ప్రమోషన్ ఇచ్చే వాళ్లు లేకపోవడంతో తానే గేమ్ ఛేంజర్‌కి ప్రమోటర్‌గా మారారనిపిస్తుంది.అందులో భాగంగానే ఇప్పటికే గత 15 రోజుల వ్యవధితో పలు మార్లు ఆయన నోటి నుంచి గేం ఛేంజర్..గేం ఛేంజర్..గేం ఛేంజర్..అనే మాట వచ్చింది.ఇవాళ పోలవరం సందర్శన సమయంలోనూ అదే మాట…మొన్న అసెంబ్లీలోనూ అదేమాట.అసలు గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో తెలిదు గానీ…అయ్యా నీకు దణ్ణం పెడతాం…నీ నోటితో ఏమీ అనకయ్య చంద్రయ్య అంటూ ట్రోల్ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.చూద్దాం..గేమ్ ఛేంజర్ పరిస్థితి ఎలా ఉండబోతుందో

