Andhra PradeshHome Page Slider

16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లే అవకాశం?

ఏపీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 16న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులను కలుసుకోనున్నట్లు తెలుస్తోంది. అమరావతి, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రుణాల రీషెడ్యూల్‌తో సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కూడా కేంద్రంతో మఖ్యమంత్రి సుధీర్ఘంగా చర్చించనున్నట్లు అభిజ్ఞ వర్గాల నుండి అందిన సమాచారం.