Breaking NewscrimeHome Page SliderNational

రాళ్ల‌దాడికి దారితీసిన ఛాంపియ‌న్స్ విజ‌యం

ఛాంపియ‌న్స్ ట్రోఫీలో టీమిండియా విజ‌యం రెండు వ‌ర్గాల ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది.మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని మాహూలో ఈఘ‌ట‌న చోటు చేసుకుంది. టీమిండియా విజ‌యానంత‌రం ఒక వ‌ర్గం వీధుల్లోకి వ‌చ్చి బాణా సంచాకాల్చుతూ ర్యాలీ చేసుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారు.ఈ నేప‌థ్యంలో నృత్యాలు చేస్తూ న‌డిరోడ్ల‌పైకి వ‌చ్చారు. ఆ వ‌ర్గానికి వ్య‌తిరేక వ‌ర్గం ర్యాలీ చేయ‌డానికి వీల్లేదంటూ వారించింది.దీంతో పోలీసులు కూడా అనుమ‌తించ‌లేదు.కొన్ని గంట‌ల త‌ర్వాత ఇది త‌మ ప్ర‌తివ‌ర్గం కుట్రే అని భావించి రాళ్ల‌దాడికి దిగారు.అది కాస్త శృతిమించి పెట్రోల్ బాంబులు విసురుకోవ‌డం దాకా వెళ్లింది.కాగా ర్యాలీ నిర్వ‌హించిన వ‌ర్గానికి బీజెపి అండ‌గా నిల‌వ‌గా…వారించిన వ‌ర్గానికి కాంగ్రెస్ మ‌ద్ద‌తుగా నిలిచింది.దీంతో ఇది రెండు వ‌ర్గాల ఘ‌ర్ష‌ణ కాస్త రెండు పార్టీల పోరుగా మారింది.పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి దాదాపు 45 మందిని అదుపులోకి తీసుకోవాల్సి వ‌చ్చింది.