ప్రభుత్వ సలహాదారుని చాగంటి కోటేశ్వరరావు
ప్రముఖ ఆథ్మాత్మికవేత్త,వేదపండితులు,సకల హిందూ ధర్మశాస్త్రాల ఔపోసనాచార్యులు చాగంటి కోటేశ్వరరావు ని ఏపి ప్రభుత్వం రాష్ట్ర నైతిక విలువల సలహాదారునిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు శనివారం ఏపి ప్రభుత్వం ప్రకటించిన రెండో విడత కార్పొరేషన్ ఛైర్మన్ ల జాబితాలో ఆయన పేరుని చేర్చింది.సనాతన ధర్మ విస్తరణకు,దాని పరిరక్షణా చర్యల మార్గనిర్ధేశనానికి చాగంటి విశేషంగా కృషి చేశారు.సామవేదం షణ్ముఖ శర్మ, గరికపాటి నరసింహారావు వంటి పండితులు ఉన్నప్పటికీ చాగంటి వైపే ప్రభుత్వం మొగ్గు చూపడం విశేషం.దీంతో హిందూవాదుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

