మీడియాకు కేంద్రం హెచ్చరిక..
సోషల్ మీడియా ఛానెళ్లకు కేంద్ర రక్షణ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశ రక్షణ కార్య కలాపాలకు సంబంధించిన లైవ్ కవరేజీలకు అనుమతి లేదని, మీడియా ఛానళ్లు దూరంగా ఉండాలని హెచ్చరించింది. సున్నితమైన అంశాలలో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీకైతే భద్రతా పరమైన చిక్కులు ఏర్పడతాయని సూచించింది. ప్రభుత్వం తెలియజేసిన సమాచారం మాత్రమే ప్రజలతో పంచుకోవాలని పేర్కొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో అసత్యాలు, తప్పుడు ప్రచారాలు చేయకూడదని అలాంటి వారికి తగిన శిక్ష పడుతుందని హెచ్చరించింది.