ఉల్లి ధరలపై కేంద్రం క్లారిటీ
ఉల్లిధరలు రోజురోజుకీ పైకి ఎగబాకుతున్నాయి. ఈ ధరలు ఎప్పుడు దిగివస్తాయనే ప్రశ్నకు కేంద్రం క్లారిటీ ఇచ్చింది. భారీగా పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రంచడానికి కేంద్రప్రభుత్వం అనేకచర్యలు తీసుకుంటోందని త్వరలోనే ధరలు అదుపులోకి వస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరొక్క నెలలోపే ఉల్లి ధరలు కేజీ 40 రూపాయలకు దిగువకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ధరల నియంత్రణకు ఉల్లి ఎగుమతులను నిషేధించిన సంగతి తెలిసిందే. కానీ మొత్తానికి ఎట్టి పరిస్థితులలో రూ. 60 దాటదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికే ఉల్లి ధరలు రూ.80 దాటింది. కొన్ని మండీలలో కూడా రూ.60 పైనే ఉల్లి ధరలు పలుకుతున్నాయి. ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గడం వల్ల దేశంలో ధరలు పెరుగుతూ ఉన్నాయి. బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ దేశాలకు భారత్ నుండి ఎక్కువగా ఉల్లి ఎగుమతి జరుగుతూ ఉంటుంది.

