తెలంగాణలో సంబరాలు షురూ..కాంగ్రెస్
తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ రాష్ట్రప్రజలందరూ ఈ సంబరాలలో ఉత్సాహంగా పాల్గొనాలని ఆశించారు. మంగళవారం అసెంబ్లీలో 2 చారిత్రాత్మక అంశాలకు ఆమోదం లభించిందని, ఈ వర్గీకరణ తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


 
							 
							