జూన్ 4 కౌంటింగ్ విషయమై రాష్ట్రాల సీఈవోలకు సీఈసీ సూచనలు
దేశ వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వచ్చేనెల 4న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల సీఈవోలు, ఇతర అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమావేశమయ్యారు. వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై ఏపీ సీఈవో ముకేష్ కుమార్ మీనాతో సహా నియోజకవర్గాల ఆర్వోలు, జిల్లా ఎన్నికల అధికారులతో ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్‌లో, సీఈసీ వివరించారు. కౌంటింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిరంతరాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పవర్ బ్యాకప్ అరేంజ్మెంట్స్ చేసుకోవాలన్నారు. ఈవీఎంల లెక్కింపు విషయమై తగిన సూచనలు ముందుగానే సిబ్బంది తెలియజేయాలన్నారు. లెక్కింపు పూర్తయిన ఈవీఎంలకు క్రమపద్ధతిలో సీల్ వేయాలన్నారు.


