Home Page SliderNational

సుప్రీంకోర్టుకు కోల్‌కతా ఘటనలో సీబీఐ కీలక నివేదిక

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కోల్‌కతా ఘటనపై నివేదికను సీబీఐ అందజేసింది. దీనిలో పలు కీలక విషయాలు ప్రస్తావించారు. వారు విచారించిన వ్యక్తుల వాంగ్మూలాలు నివేదించింది. ప్రధానంగా ఈ కేసులో 24 మందిని విచారించినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్, మాజీ ప్రిన్సిపల్ డా.సందీప్ ఘోష్, మొదటిసారి మృతదేహాన్ని చూసిన వ్యక్తి, బాధితురాలి తల్లిదండ్రులు, వారికి ఫోన్ చేసిన ఆస్పత్రి సూపరిండెంట్‌లను విచారించారు. వీరి విచారణ వివరాలను కోర్టుకు సమర్పించారు. ఇంకా ప్రాధమిక విచారణలో భాగంగా మృతురాలు ట్రైనీ డాక్టర్‌తో కలిసి భోజనం చేసిన స్నేహితులు, ఆస్పత్రికి చెందిన మరో ఇద్దరు, 49 మంది గ్రౌండ్ స్టాఫ్, సెమినార్ హాల్, రెనోవేషన్ చేసిన కార్మికులు, పోస్టుమార్టం నిర్వహించిన ఐదుగురు వైద్యులను ప్రశ్నించినట్లు సీబీఐ పేర్కొంది.