Andhra PradeshHome Page Slider

అవినాశ్ రెడ్డిపై సీబీఐ సీరియస్-పులివెందులకు సీబీఐ బృందాలు

వివేకా హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నఅవినాశ్ రెడ్డి ఈరోజు కూడా సీబీఐ విచారణకు హాజరు కానని లేఖ రాసిన విషయం తెలిసిందే. తన తల్లికి గుండెపోటు వచ్చిందని, అందుకే పులివెందుల బయల్దేరానని సీబీఐకి తెలిపారు అవినాశ్. అవినాశ్ రెడ్డి చర్యలపై సీబీఐ సీరియస్ అయినట్లు సమాచారం. ఇప్పటికే పులివెందుల బయలుదేరింది సీబీఐ బృందం. దీనితో తదుపరి సీబీఐ చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో, అవినాశ్‌ను అరెస్టు చేస్తారా అనే విచారణలు మొదలయ్యాయి. గత కొద్ది కాలంగా సీబీఐ విచారణకు రాకుండా తప్పించుకుంటున్నారు అవినాశ్. ముందస్తు బెయిల్ కోసం దరకాస్తు చేసుకుంటే కోర్టు అనుమతించని సంగతి తెలిసిందే.