Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌కు సీబీఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను కూడా విచారించనుంది. సీబీఐ. కొత్తమద్యం పాలసీలో ప్రశ్నలు అడగడానికి ఈ నెల 16న సీబీఐ ఆఫీసులో విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. ఈ లిక్కర్ స్కాంలో ఇప్పటికే ఢిల్లీ ఉపముఖ్యమంత్రిగా ఉండే మనీష్ సిసోడియాను ఈ కేసులో విచారించిన ఈడీ జైలుకు కూడా పంపించింది. తెలంగాణా ఎమ్మెల్సీ కవితను కూడా రెండుసార్లు విచారించారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.