సికింద్రాబాద్ ఘటనపై సీబీఐ విచారణ
కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచన చేసిన తర్వాత అగ్ని పథ్ తీసుకొచ్చిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఇలాంటి పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. అగ్నిపథ్ లో చేరాలని ఎవరిని బలవంతం చేయబోరని… దేశానికి సేవ చేయాలనుకున్నవారు మాత్రమే చేరాలన్నారు. సికింద్రాబాద్ ఘటన మొత్తం పథకం ప్రకారం జరిగిందన్నారు కిషన్ రెడ్డి. మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంస రచనపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్రభుత్వం విచారణ సరిగా చేయకుంటే సీబీఐతో దర్యాప్తు జరిపించి దోషులను గుర్తిస్తామన్నారు. మొత్తం ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న అభిప్రాయం కలుగుతోందన్నారు. రాజ్ భవన్ ముట్టడి, రైల్వే స్టేషన్ ఘటనల వెనుక కుట్ర ఉందన్నారు. మొత్తం ఘటనలో తమకు సంబంధం లేదని కేసీఆర్ సర్కారు వ్యవహరించడం దుర్మార్గమన్నారు ఈటల.

