ఢిల్లీ లిక్కర్ స్కామ్…అభిషేక్ రావు అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతోంది. ఢిల్లీ, హైదరాబాద్, పంజాబ్‌లోని ప్రదేశాల్లో మూడు రోజుల నుంచి ఈడీ మరోసారి దాడులు చేస్తోంది. రాబిన్ డిస్టిలర్స్‌లో డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌రావును నిన్న రాత్రి సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసులో సీబీఐ ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసింది. ఓన్లీ మచ్ లౌడర్ సీఈఓ విజయ్ నాయర్‌ను, ఇండోస్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రును ఈడీ అరెస్ట్ చేసింది. విజయ్‌నాయర్, సమీర్ మహేంద్రు అరెస్ట్ తర్వాత.. ఇప్పుడు తాజాగా సీబీఐ హైదరాబాద్‌లో అభిషేక్‌రావును అదుపులోకి తీసుకుంది .తాజా అరెస్ట్‌లతో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ప్రకంపనలు మొదలయ్యాయి.

రాధా ఇండ్రస్ట్రీస్‌కు చెందిన యూకో బ్యాంక్ ఖాతాకు సమీర్ మహేంద్రు కోటి ట్రాన్స్ ఫర్ చేసినట్లు ఈడీ దర్యాప్తులో నిర్ధారణ కావటంతో అరెస్ట్ చేశారు. ఈ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా మొత్తం 15మందిని నిందితులుగా తేల్చడంతో..ఇంకెంతమంది వెలుగులోకి వస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని జోర్‌బాగ్ లో నివాసం ఉంటున్న సమీర్ మహేంద్రును సీబీఐ ఆగస్టులో విచారించింది. ఈ స్కామ్‌లో ఆయనపై వచ్చిన ఆరోపణలపై ఈడీ ప్రశ్నించింది.