Home Page SliderNational

ఐఏఎస్‌లకు బిగ్‌షాక్ ఇచ్చిన క్యాట్

తెలంగాణలో విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ ఆఫీసర్లకు క్యాట్ బిగ్‌షాక్ ఇచ్చింది. సోమవారం క్యాట్‌లో అప్పీలు చేసిన ఐఏఎస్‌లు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్, రొనాల్డ్ రోస్, సృజనలకు ఊరట దక్కలేదు. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయలేమని, ఈ పిటిషన్‌పై విచారించిన క్యాట్ తేల్చి చెప్పింది. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపులో ఇచ్చిన రాష్ట్రాలకే వెళ్లాలంటూ తీర్పు చెప్పింది. ఏపీలో పని చేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. ఇతరులు ఏపీకి వెళ్లాల్సి ఉంది. ఏపీలో ప్రజలకు సేవ చేయాలని లేదా అంటూ వారిని ప్రశ్నించింది. డీవోపీటీకి పూర్తి అధికారాలు ఉన్నాయని, వారి ఆదేశాలపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఏపీకి వెళ్లాల్సిందేనని స్పష్టం చేస్తూ తీర్పు చెప్పింది.