Home Page SliderNational

టీవీ నటి షమ సికిందర్‌కి కాస్టింగ్ కౌచ్‌ కష్టం…

కాస్టింగ్‌ కౌచ్‌ సినీ పరిశ్రమలో పెద్ద కలకలం రేపుతుండగా తాజాగా ప్రముఖ టీవీ నటి షమ సికిందర్‌ టీవీ సీరియల్‌లో నటిస్తుండగా ఇక్కడ కూడా కాస్టింగ్ కౌచ్ ఉందని, సినీ పరిశ్రమలానే ఉందని సంచలన ఆరోపణలు చేశారు. వాణిజ్య ప్రకటన షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు ఓ స్టార్‌ నటుడు తనను అభ్యంతరకరంగా హగ్ చేసుకున్నాడని ఆమె ఆరోపించారు. సన్నివేశం ఎఫెక్టివ్‌గా రావాలనే సాకుతో ఆయన అనూహ్యంగా తనను హగ్‌ చేసుకున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో అతడితో కలిసి తాను నటించబోనని ప్రతిజ్ఞ చేసిన షమ సికిందర్‌. షూటింగ్‌లో భాగంగా సదరు నటుడు తనను హగ్‌ చేసుకోలేదని, కావాలనే వేరే ఉద్దేశంతోనే అలా ప్రవర్తించాడని చెప్పారు. అతడు తనను హగ్‌ చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు తాను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాయని అవేమీ అతను పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.

తాను ఎంతోమందితో కలిసి పనిచేశానని, తనకు ఎంతోమంది మగవారితో స్నేహాలు ఉన్నా వారెన్నడూ ఇలా తనను ఇబ్బందికి గురిచేయలేదని తెలిపారు. ఆ నటుడు చేసిన పనికి తాను స్టన్ అయ్యానని గుర్తుచేసుకున్నారు. ఆ నటుడు సూపర్‌ స్టార్‌ అని పేరును బయటపెట్టలేదు, అలాంటి వ్యక్తి ఇంత దిగజారుడుగా ఎందుకు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది ఎంతో మరపురాని సంఘటనని ఆమె పేర్కొన్నారు. తాను ఆ వ్యక్తిని తొలిసారి కలుసుకున్నానని, అతడు సాధారణంగా కనిపించలేదని, యాటిట్యూడ్‌తో ప్రవర్తించారని అన్నారు. ఇక అతడితో తన జీవితంలో ఎన్నడూ కలిసి పనిచేసేది లేదని నొక్కి వక్కాణించారు. షమ సికిందర్‌ యే మేరి లైఫ్‌ హై, బట్లీవాలా హౌస్‌ నెంబర్‌ 43, కాజల్‌, సెవెన్‌, బాల్‌ వీర్‌ వంటి టీవీ షోస్‌లో ప్రముఖ పాత్రలో నటించారు. వెబ్‌ సిరీస్‌ మాయా : స్లేవ్‌ ఆఫ్‌ హెర్‌ డిజైర్స్‌ వంటి షోలతో ప్రేక్షకుల్లో షమ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.