Andhra PradeshHome Page Slider

వైసీపీ ఎంపీ పై కేసు నమోదు

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో గురువారం జరిగిన అల్లర్ల నేపథ్యంలో 3 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక కేసులో ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పతో పాటు 33 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై రెడ్డప్ప మాట్లాడుతూ అసలు దాడి జరిగిందే మా ఇంటిపై, అలాంటిది కేసు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. పైగా మిథున్ రెడ్డి తన ఇంట్లో ఉండగా, పోలీసుల సమక్షంలోనే  ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. టీడీపీ పార్టీ పెద్దల అండతోనే కార్యకర్తలు గూండాల మాదిరి వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.