Andhra PradeshHome Page SliderNews Alert

వైసీపీ నేతపై కేసు నమోదు

కావలి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిపై కేసు నమోదయ్యింది. కోళ్లదిన్నెకు చెందిన ప్రసన్న అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. కాకాణి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఇటీవల జరిగిన మీటింగులో బోగోలు మండలం కోళ్లదిన్నెలో ఆయన ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.