Andhra PradeshHome Page SliderPolitics

ఆర్జీవీపై కేసు నమోదు

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఐటీ చట్టం కింద కేసు నమోదయ్యింది.  ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబుపై, ఆయన కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.