కేజ్రీవాల్‌పై కేసు నమోదు
ఢిల్లీ మాజీ సీఎం ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆప్ పాలనలో ప్రజానిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై ఈ కేసును నమోదు చేయాలని ఆదేశించింది. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించిన కేసులో బెయిల్‌పై ఉన్న సంగతి తెలిసిందే. గత నెలలో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో – తన సొంత నియోజకవర్గం న్యూఢిల్లీతో సహా – ఓడిపోయిన అరవింద్ కేజ్రీవాల్‌కు మరో కొత్త ఎదురుదెబ్బ తగిలింది. పెద్ద హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడానికి ప్రజా నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆయనపై, ఆప్‌లోని మరి కొందరిపై FIR నమోదు చేయాలని రాజధానిలోని కోర్టు ఆదేశించింది.

