Andhra PradeshBreaking NewsHome Page SliderNewsNews AlertPolitics

లోకేష్‌పై ట్వీట్ చేశాడ‌ని..ఎమ్మెల్యేపై కేసు

ఏపిలో రూలింగ్ ఏది అని ప్ర‌శ్నిస్తే చాలు….కేసులు,దాడులు,అరెస్టుల ప‌ర్వం సాగిస్తున్నారు. పోలీసుల‌పై ఒత్తిడి తెచ్చి మ‌రీ ప్ర‌శ్నించే స్వ‌రాల‌ను చిదిమేస్తున్నారు. గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో వంద‌లాది మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల‌ను అరెస్టు చేశారు.కొంత మంది క‌నిపించ‌కుండా పోయేస‌రికి ఆయా వ్య‌క్తుల కుటుంబీకులు హైకోర్టుని ఆశ్ర‌యించగా .. ధ‌ర్మాస‌నం సైతం విస్తుపోయేలా ప్ర‌శ్నించింది.ఈ నేప‌థ్య‌లో తాజాగా ఎమ్మెల్యేపైనే కేసు పెట్టారు. య‌ర్ర‌గొండ‌పాలెం వైసీపి ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖ‌ర్ పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మంత్రి లోకేష్ ను ఉద్దేశ్యించి…స‌ర్కార్ వారి పేకాట అంటూ ఎక్స్ లో ట్వీట్ చేసి ఎద్దేవా చేయ‌డంతో ఆయ‌న‌పై టిడిపి నాయ‌కులు కేసు పెట్టారు.దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని 41ఏ నోటీసులు జారీ చేశారు.