Home Page SliderNationalNews

మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై కేసు

బీజేపీ బెంగళూరు సౌత్ అభ్యర్థి, ఎంపీ తేజస్వి సూర్యపై ‘మత ప్రాతిపదికన ఓట్లు అడిగారంటూ’ కేసు నమోదైంది. తేజస్వి సూర్య 2019లో లోక్‌సభకు ఎన్నికైన బీజేపీ అభ్యర్థుల్లో అతి పిన్న వయస్కుడు. మతం ఆధారంగా ఓట్లు అభ్యర్థించినందుకు తేజస్వి సూర్య బెంగళూరు సౌత్ ఎంపీపై, జయనగర్ PS u/s 123(3)లో కేసు బుక్ చేయబడింది.” అని కర్నాటక ఎన్నికల అధికారి పేర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర్ నుంచి కేవలం 16 ఓట్ల తేడాతో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డిపై బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు తేజస్వీ సూర్య పోటీ చేస్తున్నారు.