Andhra PradeshHome Page Slider

కరువుకు కేరాఫ్ అడ్రస్.. చంద్రబాబు

సాయంలో చంద్రబాబులా మాయలు, మోసాలు లేవు

ఆహార భద్రతతో పాటు 62 శాతం మంది ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ రంగం అంటే వైఎస్సార్ సీపీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని గౌరవం ఉందని సీఎం జగన్ పేర్కొన్నారు. రైతు రైతు కూలీలతో కలిపిన వ్యవసాయం బాగుంటేనే రాష్ట్రం బాగుటుందన్నారు. రైతులకు అందించే సాయంతో కోతలు విధించి ఖర్చు తగ్గించుకునే మాయలు వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంత మాత్రం లేవని సీఎం జగన్ అన్నారు. ఆ మాయలు, మోసాలు కేవలం చంద్రబాబు మాత్రమే చేయగలరని విమర్శించారు. ఈ నాలుగేళ్లలో నవరత్నాల కింద ప్రజలకు అందించిన సాయాన్ని ఒక్క సారి అందరూ గమనించాలని సీఎం జగన్ విజ్ణప్తి చేశారు. టీడీపీ హయాంలో కరువుపై యుద్ధం పేరుతో తెచ్చిన రెయిన్ గన్నుల అవినీతి లేదని, కేవలం రెయిన్ మాత్రమే ఉందని సీఎం జగన్ చలోక్తులు విసిరారు. కరువు వచ్చినా కూడా చంద్రబాబు ప్రభుత్వం రెయిన్ గన్నుల పేరుతో పేరుతో అవినీతికి పాల్పడటం దారుణమని సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఒక అన్యాయస్తుడు ముఖ్యమంత్రి గా ఉంటూ కరువును తోడు తెచ్చుకున్నారని విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్లలో ఒక్క కరువు మండలం కూడా ప్రకటించే అవసరం లేనంత సుభిక్షంగా ఉండటం వైఎస్సార్ సీపీ సంక్షేమ పాలనకు నిదర్శనమన్నారు.

కరువుకు కేరాఫ్ అడ్రస్.. చంద్రబాబు
ఈ అన్యాయస్తుడు చంద్రబాబు అధికారంలో ఉన్నన్నాళ్లు కరువే ఉందని సీఎం జగన్ విమర్శించారు. రాష్ట్రం చరిత్రలో గతాన్ని చూస్తే చంద్రబాబు కరువు మాత్రమే కనిపిస్తుందన్నారు. 2019 నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవుడి దయతో ఎక్కడా కరువులేదని వర్షాలు సుభిక్షంగా పడ్డాయని సీఎం పేర్కొన్నారు. మంచి మనసుతో పరిపాలన చేస్తే ఇలా ఉంటుందని టీడీపీకి సీఎం జగన్ చురకలంటించారు. ఈ నాలుగేళ్లలో ప్రతి ఒక్క గ్రామంలో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయన్నారు. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం చూసినా ఎడారిగా మారుతుందని ప్రకటించిన అనంతపురం జిల్లాలో కూడా సుభిక్షంగా వర్షాలు పడ్డాయని వివరించారు. వర్షాలు పడటంతో పాటు నాలుగేళ్లలో పంట దిగుబడి 12 టన్నులు పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో పంట దిగుబడి 154 లక్షల టన్నులైతే వైఎస్సార్ సీపీ పరిపాలనలో 166 లక్షల టన్నులకు పెరిగిందన్నారు. గత టీడీపీ పాలించిన ఐదేళ్లలో 2.65 కోట్ల టన్నులు ధాన్యం సేకరణ చేయగా, మూడున్నరేళ్లలో తమ ప్రభుత్వం 2.94 కోట్ల ధాన్యం సేకరించామని వివిరంచారు. ధాన్యం సేకరణ కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ. 40,230 కోట్లు ఖర్చు చేస్తే రూ. 55,400 కోట్లు ఖర్చు చేసామని సీఎం జగన్ వివరించారు. రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వల్ల ఈ మూడున్నరేళ్లలో ఉద్యానవన పంటలు 1.43,900 హెక్టార్ల విస్తీర్ణం పెరిగిందన్నారు. దిగుబడి తీసుకుంటే గతంలో ఏటా 228 లక్షల టన్నులు ఉండగా ఈ ప్రభుత్వంలో రైతన్నల కష్టం, ప్రభుత్వ కృషితో 332 లక్షల టన్నులు పెరిగిందని ఏకంగా 104 లక్షల టన్నుల అధిక దిగుబడి సాధించామని సీఎం జగన్ తెలిపారు. మన మంచి ప్రభుత్వాన్ని దేవుడు చూశాడు, దేవుడు విన్నాడు, దేవుడు ఆశీర్వదించారని అందుకే ప్రతి ఇంట్లో అభివృద్ధి చూస్తున్నామని వివరించారు.

చంద్రబాబు ఎగరగొట్టిన పెండింగ్ బకాయిలు చెల్లించాం
చంద్రబాబు పెండింగ్ పెట్టిన బకాయిలను కూడా చిరునవ్వుతో మన ప్రభుత్వం బకాయిలు తీర్చిందన్నారు. గత ప్రభుత్వం పెండింగ్ ఉంచిన బకాయిల గురించి వివరిస్తూ సున్నావడ్డీ కింద రూ. 1834 కోట్లు, విత్తన బకాయిలు రూ. 384 కోట్లు, ధాన్యం సేకరణ బకాయిలు రూ. 960 కోట్లు చంద్రబాబు రైతులకు ఎగొట్టి పోతే ఆ రైతన్నల కోసం మన ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించామని సీఎం జగన్ వివరించారు. కేవలం రైతుల కోసం మూడున్నరేళ్లలో లక్షా నలభై వేల కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నానని పేర్కొన్నారు. మేనిఫఎస్టో నుంచి రైతుల హామీల వరకు మాట తప్పిన చంద్రబాబు, భజన బందం, దుష్ట చతుష్టాయికి ఇవన్నీ చేసేప్పటిక కడపు మంట పుడుతోందని విమర్శించారు. ఈ కడుపు మంటకి మందు లేదని, మనది పేదలు, రైతన్నల ప్రభుత్వం, చంద్రబాబుది పెత్తందారుల పార్టీనని సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల యుద్ధంలో రైతులను వంచించిన చంద్రబాబు ఒక వైపు, రైతుల పక్షాన నిలిచిన వైఎస్సార్ సీపీ ఒక వైపు ఉందన్నారు. కరువుతో ఫ్రెండ్ షిప్ ఉన్న బాబుకు, సుభిక్ష పాలన అందించిన మనం ఒక వైపు అని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను భ్రష్టు పట్టించిన చంద్రబాబుకు.. నాడు-నేడు ద్వారా ఇంగ్లీష్ మీడియం చదువులు ఇచ్చిన మనకు జరిగే యుద్ధంగా ప్రజలు భావించాలని సీఎం జగన్ కోరారు. పొదుపు సంఘాల మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబుకు, సున్నా వడ్డీ, అమ్మఒడి, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో ఆర్థిక భరోసా ఇస్తూ 30 లక్షల ఉచిత ఇళ్లు కట్టిస్తున్న వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి జరిగే యుద్ధమని పేర్కొన్నారు. జన్మభూమి కమిటీల రాక్షసుల పాలన.. గజదొంగల ముఠా అమలు చేసే దోచుకో పంచుకో తినుకో వర్గానికీ పేదల కోసమే నిలిచి గ్రామాల రూపు రేఖలను సచివాలయాలు, ఆర్బీకేలు, బాగు చేసిన ప్రభుత్వ బడులు, విలేజ్ క్లినిక్ రూపంలో అభివృద్ధికి బాటలు వేసిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి తేడా ఎంతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు.

తెనాలి అభివృద్ధికి 43 కోట్లు మంజూరు
తెనాలి ఎమ్మెల్యే శివ కుమార్ కోరిక మేరకు తెనాలి నియోజకవర్గం అభివృద్ధి పనులకు గాను 43 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. రోడ్డు విస్తరణ కోసం 10 కోట్లు, ఎస్సీ కాలనీ శ్మశానవాటికకు 9 కోట్లు, షాదీ ఖానాకు 4 కోట్లు, మున్సిపాలిటీ భవనానికి 15 కోట్లు, వ్యవసాయ మినీ యార్డుకు 5 కోట్లు రూపాయలను జగన్ ప్రకటించారు.