HealthNationalNews

ఊబకాయంతో ఈక్యాన్సర్ ముప్పు

అనారోగ్యకరమైన జీవన విధానాలు, జీవన శైలి కారణంగా అనేకమంది ఊబకాయం బారిన పడుతున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని అధ్యయనాల ప్రకారం అధిక బరువు కారణంగా క్లోమగ్రంధి (ప్యాంక్రియాస్‌) క్యాన్సర్ ముప్పు పొంచి ఉందని వెల్లడయ్యింది. ముఖ్యంగా 50 సంవత్సరాల లోపు వారిలో ఈ ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ వ్యాధి సాధారణంగా వృద్ధులకు మాత్రమే వస్తుందని గతంలో భావించేవారు. కానీ ఈ మధ్య అధిక బరువు, స్థూలకాయం కారణంగా 40 ఏళ్లకే ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం ఆందోళన కలిగించేలా ఉందని, కానీ బరువును అదుపులో పెట్టుకుంటే ఈ ప్రమాదాన్ని నివారించడం పెద్ద కష్టమేం కాదన్నారు. జన్యు పరంగా వచ్చే వ్యాధులను ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ ఊబకాయాన్ని తగ్గించుకోవడం ద్వారా టైపు 2 మధుమేహం, ఇతర క్యాన్సర్లు, గుండె జబ్బులను నివారించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు, తగినంత వ్యాయామం ద్వారా అనారోగ్యాన్ని అరికట్టవచ్చు.