తేనెటీగతో క్యాన్సర్ ఖతం!
ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండవ ప్రధాన కారణం క్యాన్సర్. ప్రతి సంవత్సరం 10 మిలియన్ల మంది క్యాన్సర్ తో మరణిస్తున్నారు. లక్షలాది మందిని బలి తీసుకుంటున్న క్యాన్సర్ వ్యాధికి విరుగుడును ఆస్ట్రేలియన్ సైంటిస్టులు కనుగొన్నారు. తేనెటీగ విషంలో ఉండే మెలిటిన్ అనే పెప్టైడ్ పదార్థం బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను జస్ట్ ఒక గంటలోనే చంపేస్తున్నాయని గుర్తించారు. ఈ రీసెర్చ్ కోసం 312 తేనెటీగల విషాన్ని సేకరించి సైంటిస్టులు ప్రయోగాలు చేశారు. క్యాన్సర్ కణాల విభజనను మెలిటిన్ 20 నిమిషాల్లోనే అడ్డుకుంటుందని, ఆ తర్వాత 60 నిమిషాల్లోనే కణాలను చంపేస్తుందని గుర్తించారు. మెలిటిన్ ను కృత్రిమంగా కూడా తయారు చేయవచ్చని, కృత్రిమంగా తయారు చేసిన మెలిటిన్ కూడా క్యాన్సర్ పై అదే స్థాయిలో పని చేస్తుందని సైంటిస్టులు వెల్లడించా రు. వీరి రీసెర్చ్ వివరాలు ఇటీవల ‘ఎన్ పీజే నేచర్ ప్రిసిషన్ ఆంకాలజీ’ పత్రికలో ప్రచురితమయ్యాయి. అయితే.. తేనెటీగల విషంలో మెలిటిన్ పదార్థం దాదాపు 50 శాతం వరకు ఉంటుంది. దీని వల్లే తేనెటీగలు కుట్టినప్పుడు నొప్పి, వాపు, బెందులు వస్తుంటాయి. అయితే, అలర్జీ ఉన్నవారికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయని, అందుకే దీనిని సురక్షితంగా వాడటంపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆస్ట్రేలియన్ సైంటిస్టులు చెప్తున్నారు.