కెనడా కార్చిచ్చు బీభత్సం..17 వేలమంది తరలింపు
కెనడాలోని సస్కెట్చివాన్ ప్రావిన్స్‌లో కార్చిచ్చులు బీభత్సం సృష్టించాయి. దీనితో ఆ ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. దాదాపు 17వేల మందిని ఇళ్లు ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఏడు లక్షల ఎకరాలలో ఈ కార్చిచ్చులు వ్యాపించాయని, పరిస్థితులు అనుకూలంగా లేదని, ప్రమాదంగా ఉందని అధికారులు చెప్తున్నారు. కెనడా వైమానిక దళం కూడా రంగంలోకి దిగి మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. లక్షన్నర ఎకరాలకు పైగా కాలి బూడిదయ్యాయి. మూడు రోజుల పాటు వర్షం పడితే గానీ ఈ కార్చిచ్చు అదుపులోకి రాదని భావిస్తున్నారు. ఈ కార్చిచ్చుల నుండి వెలువడుతున్న పొగ అమెరికా వైపు కూడా వ్యాపిస్తోంది. మిన్నెసోటా, మిషిగాన్ వంటి రాష్ట్రాలకు వెళుతోంది. దీనివల్ల అమెరికాలో ప్రజలు కూడా శ్వాసకోశ ఇబ్బందులు పడుతున్నట్లు ది అమెరికన్ లంగ్ అసోషియేషన్ పేర్కొంది.

