‘వారిని తీసుకురాగలరా?’..మస్క్‌ను కోరిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సంస్థ యజమాని మస్క్‌ను ఒక సహాయం కోరారు. అదేంటంటే గతేడాది జూన్‌లో అంతరిక్షానికి వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లు అనుకోని పరిస్థితులలో అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోవలసి వచ్చింది. దీనితో వారిని తిరిగి తీసుకువచ్చే ప్రయత్నాలు చేయాలని మస్క్‌ను విజ్ఞప్తి చేశారు ట్రంప్. పది రోజుల పని కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లినవారు బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సమస్యలు రావడంతో తిరిగి రాలేకపోయిన సంగతి తెలిసిందే. గత బైడెన్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే వారు ఇంతవరకూ అంతరిక్షంలో ఉండిపోవలసి వచ్చిందిని మస్క్ విమర్శించారు. గతంలో నాసా కూడా మస్క్ సహాయం కోరింది. గత ఆగస్టులో స్పేస్ ఎక్స్‌కు సంబంధించిన డ్రాగన్ అనే రాకెట్ ఇద్దరు వ్యోమగాములతో, రెండు ఖాళీ సీట్లతో అంతరిక్షానికి వెళ్లింది. తిరిగి వచ్చేటప్పుడు వారిని కూడా తీసుకురావాల్సి ఉండగా, డ్రాగన్ కూడా ఇంతవరకూ తిరిగి రాలేదు. అయితే మస్క్ తాజాగా ఈ విషయం ట్విటర్‌లో తెలియజేయడంతో వారిని తీసుకువచ్చే ప్రయత్నాలు వేగవంతం అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది.
Breaking news: మహా కుంభమేళాలో ఘోరం..17 మంది మృతి