Andhra PradeshHome Page Slider

‘చంద్రబాబు పేదలకు చేసిన ఒక్క మంచైనా చెప్పగలడా’… కావలిలో సిద్ధం సభలో జగన్ సవాల్

14 ఏళ్లు మూడు తడవల పాటు  ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఇది నేను పేదలకు చేసిన మంచి అని చెప్పుకోలడా… అని సవాల్ చేశారు కావలిలో సిద్ధం సభలో జగన్. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఎన్నికలకు ముందు మాత్రమే కాక ఎన్నికలైన తర్వాత కూడా మేనిఫెస్టోని చూపించాలని డిమాండ్ చేశారు. కనీసం ఆ మేనిఫెస్టోలో ఐదుశాతం అయినా అమలు చేశానని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. మరి ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీమార్కు ప్రజల హృదయాలలో ఉందా.. ఉంటే మూడు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమేముందన్నారు. వెన్నుపోటు రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలతోనో కొన్నాళ్లు ముఖ్యమంత్రిగా నెట్టుకొచ్చారని మండిపడ్డారు. కనీసం ఆ సమయంలో పేదలకు ఒక్కపని చేసాను అని చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పటికీ తాను చేసిన పనుల గురించి చెప్పకుండా నాకు ఓటు వేస్తే ఇది చేస్తా, అది చేస్తా అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ చేసిన మంచి పనులు చెప్పుకునే దమ్ము ఆయనకు లేదు. ఎందుకంటే అలాంటి మంచి పనులేవీ చెయ్యలేదు. కానీ మీ బిడ్డ జగన్ సిద్ధం, సిద్ధం అని ఊరూరా సభలు పెట్టి వివిధ పథకాల ద్వారా తొలిసారి ముఖ్యమంత్రిగా చేసిన ఈ కొద్ది కాలంలోనే నవరత్నాలు పెట్టి, నేరుగా లబ్ది దారుల ఖాతాలలో సొమ్ము పడేలా చేస్తున్నానని పేర్కొన్నారు. అందుకే నేడు ధైర్యంగా మళ్లీ మీ ముందుకు వచ్చి ఓట్లడిగే హక్కు నాకే ఉందని ధీమా వ్యక్తం చేశారు.