వ్యాపార దిగ్గజం…ఇండస్ట్రీ నుంచి మాయమైన మిస్త్రీ
సైరస్ మిస్త్రీ దివంగత పల్లోంజి మిస్త్రీకి చిన్న కుమారుడు. టాటా గ్రూపులో అతిపెద్ద వాటాదారు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్. 2012లో రతన్ టాటాకు 75 ఏళ్లు నిండిన తర్వాత ఆయన స్థానంలో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ నియమితులయ్యారు. మిస్త్రీ 2006లో టాటా గ్రూప్‌లో డైరెక్టర్‌గా చేరారు. అంతకుముందు అనేక ఇతర టాటా కంపెనీల బోర్డుల్లో నాన్-ఎగ్జిక్యూటివ్ పదవులను నిర్వహించారు. 142 సంవత్సరాలలో టాటా గ్రూప్‌కు టాటా కుటుంబం బయట నుంచి నాయకత్వం వహించిన రెండో వ్యక్తి మిస్త్రీ. కీలక బాధ్యతలు దక్కించుకున్నా ఆయన పదవిలో కేవలం నాలుగేళ్లు మాత్రమే కొనసాగారు. అక్టోబర్ 2016లో, మిస్టర్ మిస్త్రీని నాటకీయ పరిణామాలతో ఛైర్మన్ బాధ్యతల నుంచి తొలగించారు.

నెలరోజుల తర్వాత — డిసెంబర్ 2016లో… మిస్త్రీ కుటుంబానినికి చెందిన రెండు పెట్టుబడి సంస్థలు – సైరస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్… టాటా సన్స్ దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపిస్తూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించాయి. ఫిబ్రవరి 2017లో, టాటా గ్రూప్ సంస్థల హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్ బోర్డు నుండి మిస్త్రీని డైరెక్టర్‌గా తొలగించారు.

మిస్త్రీ టాటా సన్స్‌కు చైర్మన్‌గా నియమించబడటానికి ముందు నిర్మాణ దిగ్గజం షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. 1991లో షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌లో డైరెక్టర్‌గా ఆయన కెరీర్ ఆరంభించారు. జూలై 4, 1968న జన్మించిన మిస్త్రీ లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ మెడిసిన్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లండన్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.


